Homemain slidesఆంధ్రాకి మట్టి, తెలంగాణ కు గాడిద గుడ్డు...

ఆంధ్రాకి మట్టి, తెలంగాణ కు గాడిద గుడ్డు…

భారత్ సమాచార్, హుజూరాబాద్ ; మరో రెండు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు మండుటెండను సైతం లెక్క చేయకుండా ముమ్మురంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఘూటు విమర్శలు చేశారు.

కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనదని సీఎం పేర్కొన్నారు . ఎర్రజెండా నీడలో ఎంతో మంది విప్లవకారులు ఈ జిల్లా నుంచి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. చింతమడక నుంచి వచ్చిన కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. కరీంనగర్ ను వదిలి కేసీఆర్ మహబూబ్ నగర్ వస్తే మేం ఆలోచించకుండా గెలిపించామన్నారు.సెమీఫైనల్ లో కేసీఆర్ ను చిత్తు చిత్తు చేశాం. ఫైనల్స్ లో తెలంగాణ పౌరుషం గుజరాత్ కు తెలిసే విధంగా మోడీని ఓడించాలని ఓటర్లను కోరారు.
పదేళ్లు ప్రధాని గా ఉన్న మోదీ తెలంగాణ కు ఇచ్చింది ఏమీ లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది ఏమీ లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పునర్వీభజన చట్టంలోని ఏ అంశాలను కూడా అమలు చేయలేదన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటు పార్లమెంటులో తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలను అవమానించేలా మోదీ మాట్లాడారని విమర్శించారు.

తెలంగాణను అవమానించిన బీజేపీకి, బండి సంజయ్ కు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. కరీంనగర్ లో అరగుండు, నిజమామాబాద్ లో గుండు రాష్ట్రానికి తెచ్చిందేం లేదని విమర్శలు గుప్పించారు. ఈ పదేళ్లలో తెలంగాణాకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు, ఆంధ్రాకి మట్టి, కర్ణాటకకు చెంబు అని ఘూటుగా విమర్శించారు. అయోధ్య లో రాముడి కళ్యాణానికి 15 రోజుల ముందే అక్షింతలు పంచారని చెప్పారు. ఇది శ్రీరాముడిని అవమానించడమేనన్నారు. హిందువులందరూ ఆలోచించాలని కోరారు. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్నారని తెలిపారు. నేను హిందువును. కాని ఓట్ల కోసం హిందుత్వాన్ని వాడుకోనన్నారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలని తెలిపారు. రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుకునే దిక్కుమాలిన పరిస్థితి కరీంనగర్, నిజామాబాద్ లో ఉందన్నారు.

బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించటానికి బీజేపీ కుట్ర పడుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు అవుతాయన్నారు. కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందో మోదీ సమాధానం చెప్పాలని కోరారు. తెలంగాణకు వస్తున్న మోదీ రిజర్వేషన్లపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేను రిజర్వేషన్లపైన మాట్లాడితే ఢిల్లీ నుంచి వెంటనే పోలీసులు వచ్చారన్నారు. పదేళ్లు కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు. చివరకు ఏమైంది కేసీఆర్ నడుం ఇరిగి మూలకు పడ్డాడని చెప్పారు. కారు కరాబు అయి కార్ఖానాకు పోయిందన్నారు. కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడన్నారు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సు యాత్ర సాగుతోందన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, కరీంనగర్,మల్కాజ్ గిరి లాంటి సీట్లలో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. నల్గొండ, మెదక్ లాంటి సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నది బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. వెలిచాల రాజేందర్ రావును కరీంనగర్ ఎంపీగా లక్ష మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మరికొన్ని రాజకీయ సంగతులు…

అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు ఓటుకు ఒట్టు

RELATED ARTICLES

Most Popular

Recent Comments