September 4, 2026 11:14 am

Email : bharathsamachar123@gmail.com

అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు ఓటుకు ఒట్టు

భారత్ సమాచార్, మెదక్ ; రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయం ముగియనుంది. ఇప్పటికే లోక్ సభ రెండో దశ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రధాన నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా పొలిటికల్ పంచ్ డైలాగులతో, విమర్శల బాణాలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరిష్ రావు మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డి కి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులపై ఘూటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేసుకుందని దుయ్యబట్టారు. ఆగష్టు 15 నాటికి రుణమాఫీ, ఆరు గ్యారెంటీకు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీఎం సవాల్ విసిరితే తోక ముడిసిండన్నారు. మోసం చేస్తే తెలంగాణ ప్రజలు మోసపోరన్నారు. అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు ఓటుకు ఒట్టు అనే డ్రామాలాడుతున్నారన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ పగలాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దెర మాటలు చెప్పడం తప్ప,జనాలను ఉద్దరించింది లేదన్నారు. బిజెపి కార్పొరేట్ పెద్దల పార్టీ అన్నారు. బిజెపికి ఆదాని అంబానీ ఇద్దరు ఉంటే చాలు. దేశ ప్రజల సమస్యలు అక్కరలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న కూడా దళితులకు వర్గీకరణ చేయరు, బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టరని విమర్శించారు. ఇక్కడ బిజెపి అభ్యర్థికి మాటలు ఎక్కువ చేతలు తక్కువన్నారు. కాంగ్రెస్ పార్టీ నీ నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచారు. కాంగ్రెస్ పార్టీ పాలన లో అన్ని వర్గాల వారు గోస పడుతున్నారన్నారు .కేసిఆర్ పరిపాలన లో సంక్షేమం , అభివృద్ధి అందరికీ అందిందన్నారు.

కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, కరెంట్ కోతలు, మోటర్ కాలుడు స్టార్ట్ అయిందన్నారు. పదేళ్ళ బీజేపీ పాలన లో ప్రజల కోసం చేసింది ఏమీలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది కేవలం బి అర్ ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. ఆరు గ్యారంటీల హామీల అమలు కోసం అసెంబ్లీ లో కాంగ్రెస్ ప్రభుత్వంను నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ఆరోపించారు. రాజీనామా విషయం లో రేవంత్ రెడ్డి తోక ముడిచి పారిపోయిండన్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. వరి కొనుగోలులో తరుగు పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లల్లో తరుగు పెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. హామీల అమలు కోసం అసెంబ్లీ లో గట్టిగా కొట్లడాలంటే బి అర్ ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. మెదక్ ఎంపీ గా బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థించారు.

మరికొన్ని రాజకీయ సంగతులు…

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Share This Post