భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

డిసెంబర్ 5న మెగా PTM: కలెక్టర్

WhatsApp Image 2025-11-29 at 4.36.58 PM

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 5వ తేదీన జిల్లాలోని 1468 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ (PTM 3.0) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య బంధం బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం అన్నారు.

ఈ PTMలో విద్యార్థుల చదువు, ప్రవర్తన, క్రీడలు, బలహీనతలు వంటి అంశాలపై పరస్పర చర్చ జరిపి, అభివృద్ధికి సమన్వయంగా పనిచేయాలని సూచించారు. తల్లిదండ్రులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమాలలో స్పోర్ట్స్, సైన్స్ ఎగ్జిబిషన్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని వెల్లడించారు. 10వ తరగతి ఉత్తీర్ణత కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. డ్రాప్‌ఔట్ తగ్గించడానికి, బాల్యవివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.