భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. పినపాక మండలానికి చెందిన తోలెం రవికుమార్, అరుణ దంపతులు ప్రైవేట్ ఆస్పత్రి కంటే మెరుగైన వైద్యం అందుందని ప్రసవం కోసం మణుగూరు వంద పడకల ఆసుపత్రికి వచ్చారు. అరుణకు సర్జరీ చేసి ప్రసవం చేయాల్సిన సమయంలో సాధారణ ప్రసవం కోసం ప్రయత్నాలు చేశారు. దీంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శిశువు మృతి చెందిన విషయం గోప్యంగా ఉంచి ఆక్సిజన్ పెట్టి భద్రాచలం కారులో తరలించారని శిశువు తల్లిదండ్రులు రోధిస్తూ తెలిపారు. కాగా శిశువును పరీక్షించిన భద్రాచలం డాక్టర్లు మృతి చెంది చాలా సమయం గడిచిందని వెల్లడించారని వారు తెలిపారు. శిశువు డాక్టర్ల నిర్లక్ష్యం వలనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BHARATH SAMACHAR DIGITAL
30, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్