భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి అధ్యక్షతన మాసాయిపేట మాజీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాసాయిపేట గ్రామపంచాయతీ బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ లో ముఖ్యఅతిథిగా మెదక్ బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. విశ్వ గురువు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శ స్ఫూర్తిగా తీసుకొని గ్రామ అభివృద్ధికై తోడ్పడుతు గ్రామ ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సేవకై కృషి చేస్తానని సర్పంచి అభ్యర్థి వేణుగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు, మండల పదాధికారులు, బూత్ అధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
3, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్