భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

గుమ్మడిదలలో అంబేద్కర్ వర్థంతి

b5a826c9-de4b-4560-b622-0bffff17db44

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గుమ్మడిదల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడిస్తేనే సమానత్వం, సామాజిక న్యాయం, అందరికీ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో అంబేద్కర్ ఆలోచనలు ఇవాళ కూడా సమకాలీనమని, ఆయన కలలను నెరవేర్చడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొంట అంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ, ఆకుల నవీన్, భార్గవ్, చక్రపాణి, సంజీవరెడ్డి, సూర్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు యాదవ్, బాల్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, జయపాల్ రెడ్డి, నర్సింగరావు, కిరణ్, శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.