భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గుమ్మడిదల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడిస్తేనే సమానత్వం, సామాజిక న్యాయం, అందరికీ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో అంబేద్కర్ ఆలోచనలు ఇవాళ కూడా సమకాలీనమని, ఆయన…