భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహనీకి ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీసీ సంఘం నాయకులు దండ్ల వెంకటయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. భారత దేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయుడు బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అసమానతలపై ఆయన చేసిన పోరాటాలు భారతదేశ చరిత్రలో సుస్థిరంగా ఉన్నాయన్నారు. అంటరానితనాన్ని తుద ముట్టించడం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధుడు బీఆర్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ హక్కులు అన్ని వర్గాలకు అందాలని రాజ్యాంగంలో పొందుపరచిన మహనీయుడు బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద శంకర్ మాదిగ, దండ్ల వెంకటయ్య, మీసాల ఉప్పలయ్య, బూడిద జానీ, కొన్నే వెంకటేష్, పాపట్ల నరహరి, బబ్బురి పోశెట్టి, సీసా శ్రీనివాస్, ఆకారపు లక్ష్మి నారాయణ, గుండ్ల పల్లి వెంకటేష్, బూడిద సింహాద్రి, కోట ఉపేందర్, శివరాత్రి నరసింహ, శివరాత్రి శివ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
7, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్