భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహనీకి ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీసీ సంఘం నాయకులు దండ్ల వెంకటయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. భారత దేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయుడు బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అసమానతలపై ఆయన చేసిన పోరాటాలు భారతదేశ చరిత్రలో సుస్థిరంగా ఉన్నాయన్నారు. అంటరానితనాన్ని తుద ముట్టించడం కోసం అలుపెరుగని…