భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

5వ వార్డ్ అభివృద్ధికి విజన్-7.. ఆశీర్వదించి ఆదరించండి

Screenshot 2025-12-07 131910

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: యుద్ధంలో గెలవాలంటే రణరంగంలో ఆరితెరిన చేతికే కత్తిని ఇవ్వాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంపై పూర్తి అవగాహన, ప్రత్యేక పనితీరుతోపాటు, నిరంతరం గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే వారికే ఓటు వేయాలి. కట్టంగూరు మండలం చెరువుఅన్నారం గ్రామంలో 5వ వార్డు సభ్యురాలు దెందె మంగమ్మ సైదులును గెలిపించి 5వ వార్డును అభివృద్ధి చేసుకుందాం. గతంలో ఎంతోమందిని గెలిపించుకున్నాం.. ఈసారి ఒక్క అవకాశం ఇచ్చి దెందె మంగమ్మను గెలిపించుకుందాం. 5వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందాం.

 

దెందె మంగమ్మనే ఎందుకు గెలిపించాలంటే…?
ప్రజలందరితో కలివిడితనం, కలుపుకుపోయే గుణం ఉండడం, సమాజం పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగిఉన్న తన కుమారుడు ప్రవీణ్‌తో గ్రామ, వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేసే విజన్-7 అంశాలతో ముందుకెళ్తుండడం. అసలు 5వ వార్డు అభివృద్ధి కోసం విజన్ 7 ఏంటి.

విజన్-7 లోని ముఖ్యమైన అంశాలు.

1) వార్డులో శుభ్రతకు ప్రాధాన్యం,

2) డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం,

3) ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి (ప్రతి ఆరు నెలలకొకసారి హెల్త్ చెకప్స్),

4) యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన,

5) క్రీడల అభివృద్ధి, వాలీబాల్, క్రికెట్ బాల్, బ్యాట్ స్పాన్సర్,

6) నీటి సమస్యలపై తక్షణ చర్య,

7) వీధిలైట్లు, గుంతల సమస్యలపై పూర్తి పనిబాధ్యత.

 

మరిన్ని కథనాలు: 

దైవ దర్శనానికి వెళ్లి.. కళ్లముందే మృత్యుఒడిలోకి