భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

ఉప్పర సంఘం నూతన జిల్లా అధ్యక్షుడికి స‌న్మానం

WhatsApp Image 2025-12-12 at 8.48.14 PM

భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : సగర ఉప్పర సంఘం నూతన జిల్లా అధ్యక్షుడిగా గోనబావి గోపాల్ ఎన్నికైన సందర్భంగా, ఆదోనిలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. మిత్రులు మగుద్దుమ్ బాషా, పలువురు పెద్దలు, సంఘ సభ్యులు గోపాల్‌ను శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

 

ఈ సందర్భంగా గోనబావి గోపాల్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి, సంఘ సేవల్లో, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ముందంజ ఉండి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ సన్మానం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.