భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

కొనాయపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

WhatsApp Image 2025-12-14 at 11.49.58 AM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : మనోహరాబాద్ మండలం కొనాయపల్లి పీటీలోని పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఇరు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

ఈ ఆరోపణలు తారాస్థాయికి చేరి గొడవకు దారితీయడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని, ఇరు వర్గాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కట్టుదిట్టం చేశారు.