భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

News Roundup : న్యూస్ రౌండ‌ప్

news-roundup-1024×703-1-1 (1)

భార‌త్ స‌మాచార్.నెట్, హైద‌రాబాద్ :

➨ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లారు. వివిధ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఆయన చర్చించనున్నారు.

➨ ఈ నెల 22న జనసేన పార్టీలో కొత్త పదవుల బాధ్యతల స్వీకార కార్యక్రమం ‘పదవి-బాధ్యత’ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

➨ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ‘అతిపెద్ద స్కామ్’గా అభివర్ణిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

➨ ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

➨ TTD భూములను ప్రైవేట్ సంస్థలకు బదలాయించడంపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

➨ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.

➨ పంచాయతీ ఎన్నికల ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

➨ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయని ఐఎండీ హైదరాబాద్ ‘కోల్డ్ వేవ్’ హెచ్చరికలు జారీ చేసింది.

➨ ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి.

➨ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు ఈరోజు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.

➨ హైదరాబాద్‌: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. రవిని ప్రశ్నించనున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

➨ రెండో రోజూ ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగింది. భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది.

➨ ఉపాధి హామీకి బదులుగా తెచ్చిన కొత్త ‘G RAM G’ బిల్లును విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదించింది.

➨ విద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ కోసం కర్ణాటక అసెంబ్లీ ‘హేట్ స్పీచ్ బిల్లు’ను ఆమోదించింది.

➨ ప్రధాని మోదీకి ఒమన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ లభించింది.

➨ ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులపై కేసు నమోదు చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం

➨ కర్ణాటకలో చైనాకు చెందిన జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సముద్రపు పక్షి కలకలం

➨ వీసా వ్యాలిడిటీ కేవలం ప్రవేశం కోసమేనని, అక్కడ ఉండే సమయాన్ని అది నిర్ణయించదని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది.