భారత్ సమాచార్, కర్నూలు జల్లా: జిల్లాలో నిత్యావసర సరుకుల నిల్వలు సక్రమంగా ఉండేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. గురువారం కర్నూలు చాణిక్యపురి కాలనీలోని పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, ఇన్వర్డ్ అవుట్వర్డ్ వివరాలు, నిల్వల లెక్కలను జాగ్రత్తగా పరిశీలించారు. సరుకుల నాణ్యత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గోదాం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, అవసరమైన చిన్న మరమ్మతులు వెంటనే చేపట్టాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
BHARATH SAMACHAR DIGITAL
19, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్