భారత్ సమాచార్, కర్నూలు జల్లా: జిల్లాలో నిత్యావసర సరుకుల నిల్వలు సక్రమంగా ఉండేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. గురువారం కర్నూలు చాణిక్యపురి కాలనీలోని పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, ఇన్వర్డ్ అవుట్వర్డ్ వివరాలు, నిల్వల లెక్కలను జాగ్రత్తగా పరిశీలించారు. సరుకుల నాణ్యత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గోదాం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, అవసరమైన చిన్న మరమ్మతులు వెంటనే చేపట్టాలని సిబ్బందికి…