భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

’40 ఏళ్లుగా దక్కని ప్రాతినిధ్యం’

WhatsApp Image 2025-12-18 at 8.48.54 PM

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: రెంజల్ మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బోధన్ డివిజన్ కో-కన్వీనర్ నీరడి రవి నేతృత్వంలో ఎంపీడీవో కమలాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలం ఏర్పడి 40 ఏళ్లు గడిచినా, ఇప్పటివరకు దళిత, గిరిజనులకు ఈ కీలక స్థానాల్లో అవకాశం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

జనాభా అధికంగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ రొటేషన్‌లో రెంజల్‌ను నిరంతరం జనరల్‌గా కేటాయించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ఈ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోతే భవిష్యత్తులో దళిత, బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఉధృతమైన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.