భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: రెంజల్ మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బోధన్ డివిజన్ కో-కన్వీనర్ నీరడి రవి నేతృత్వంలో ఎంపీడీవో కమలాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలం ఏర్పడి 40 ఏళ్లు గడిచినా, ఇప్పటివరకు దళిత, గిరిజనులకు ఈ కీలక స్థానాల్లో అవకాశం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

జనాభా అధికంగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ రొటేషన్‌లో రెంజల్‌ను నిరంతరం జనరల్‌గా కేటాయించడం అన్యాయమని వారు…