భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

మాటూరు గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

3eea1eb9-b191-497b-8a8f-a328bd00710f (1)

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ముందస్తు క్రిస్మస్ వేడుకలను పాస్టర్ ధానావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, ఈ కార్యక్రమానికి మాటూరు గ్రామ పిల్లలు, పెద్దలు, మహిళలు, నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. సుమారు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు కొవ్వత్తులు వెలిగించి క్రిస్మస్ వేడుకలకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాస్టర్ ఏలీయా నాయక్ (గుంటూరు వాస్తవ్యులు) మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ ఆవిర్భావం, పండుగ ఆవశ్యకత తెలియజేశారు. మాటూరు గ్రామ ప్రజలు క్షేమంగా ఉండాలని ఆయన ప్రార్థనలు చేశారు.

 

ఈ కార్యక్రమ నిర్వాహకులు పాస్టర్ ధానావత్ బాలు నాయక్ మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకలలో పిల్లల నృత్యాలు, క్రిస్మస్ నాటికలు విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం 350మందికి భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాటూరు గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి వెంకట్రాం నాయక్ ను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ధానావత్ పత్తి నాయక్, ధానావత్ మోతీలాల్ నాయక్, ఇస్రాం సైదులు, గ్రామ యువ నాయకులు ధానావత్ రతన్ నాయక్, కలకొండ శివశంకర మల్లయ్య, తదితరులను కూడా శాలువాలతో పాస్టర్ బాలు నాయక్, వినీత దంపతులు సన్మానించారు.