భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

నిజాంషుగర్ మూసివేతకు పదేళ్లు.. కార్మికుల నిరసన

0113a9f7-3d07-49d2-834a-08524b719c23

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఆసియా ఖండంలో అతిపెద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు పదేళ్లు పూర్తైన సందర్భంగా డిసెంబర్ 23న కార్మికులు బోధన్‌లో బ్లాక్‌డే నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి ప్రధాన గేటు ఎదుట నల్ల బ్యాడ్జ్‌లతో నిరసన చేపడతామని తెలిపారు. 2015లో బోధన్, మెదక్, మెట్పల్లి ఫ్యాక్టరీలను అన్యాయంగా మూసివేశారని, అప్పటి నుంచి వేతనాలు, బెనిఫిట్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా న్యాయం జరగలేదన్నారు. గ్రాట్యుటీ, ఫ్యూనరల్ ఖర్చులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఫ్యాక్టరీలను రీఓపెన్ చేయాలి లేదా కార్మికులకు ఇతర ప్రభుత్వ రంగాల్లో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.