భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

గుడిసె కృష్ణమ్మకు టీడీపీ నేతలు శుభాకాంక్షలు

Screenshot 2025-12-25 091217

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా:  కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆదోనికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వడ్డెమాన్ గోపాల్ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడిసె కృష్ణమ్మ అనుభవజ్ఞ నాయకత్వంతో జిల్లాలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేస్తారని, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు తీసుకెళ్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో టీడీపీకి మరిన్ని విజయాలు సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రజల సమస్యలపై పోరాడే నాయకత్వం ఆమెదని ప్రశంసించారు.