భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

బోధన్‌కు సీఎం రేవంత్ రెడ్డి..?

WhatsApp Image 2025-12-25 at 10.03.47 PM

భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపుతుండటంతో సీఎం రాకపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.

ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే, కేవలం రూ. 100 కన్సల్టేషన్ ఫీజుతో సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది. 24 గంటల పాటు ఎండీ (MD) డాక్టర్ల సేవలు అందుబాటులో ఉండటం విశేషం. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.