భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

దేవనకొండ రెండో వార్డులో డెంగీ కేసు నమోదు

be217718-164a-4a86-850e-67dbc3800af9

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: దేవనకొండ పట్టణంలోని రెండో వార్డులో డెంగీ కేసు నమోదైంది. ఆ వార్డుకు చెందిన సానియా (6)కు డెంగ్యూ సోకినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. చిన్నారికి జ్వరం తీవ్రంగా ఉండటంతో తొలుత స్థానిక వైద్య కేంద్రంలో చికిత్స అందించారు. అనంతరం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డెంగీ వ్యాప్తి నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ పనులు చేపట్టడంతో పాటు నిల్వ నీరు లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.