భారత్ సమాచార్.నెట్: ఐదు దేశాల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ గురువారం ఘనా పార్లమెంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘనా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఘనా దేశాధ్యక్షుడికి.. ఆయన జీవిత భాగస్వామి ఘనా తొలి మహిళకు.. ఘనా దేశ ఉపాధ్యక్షుడికి.. ఘనా పార్లమెంట్ స్పీకర్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు అందించారు.
ఘనా అధ్యక్షుడికి బహుమతిగా ఫైన్ బిద్రి ఆర్ట్‌వర్క్ వాసే. కర్ణాటకలోని బీదర్‌లో తయారైన ఈ అద్భుతమైన బిద్రివేర్ పూల కుండీలు.. ఆయన జీవిత భాగస్వామికి ఒడిశాలోని కటక్‌లో తయారు చేసిన సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ పర్స్ బహుమతిగా ఇచ్చారు. ఘనా ఉపాధ్యక్షుడికి బహుమతిగా కాశ్మీరీ పాష్మినా షాల్.. ఘనా స్పీకర్‌కు పశ్చిమ బెంగాల్లో చేతితో తయారు చేసిన చిన్న ఏనుగు అంబావారిని గిఫ్ట్‌గా ఇచ్చారు ప్రధాని.
ఇకపోతే ప్రధాని మోదీకి ఘనా దేశం ఆయనకు అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ప్రధానం చేసింది. ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ప్రధానిని సత్కరించింది. ఈ అత్యున్నత గౌరవాన్ని అక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ స్వయంగా ప్రధాని మోదీకి అందజేశారు. ఈ సత్కారంపై ప్రధాని మోదీ స్పందించారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత యువత ఆశయాలకు, భారతదేశ సాంస్కృతిక సంపదకు, అలాగే భారత్-ఘనా దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలకు అంకితంగా ఈ పురస్కారాన్ని అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.