భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, జులై 2025, మంగళవారంభారత్ సమాచార్

8 Vasanthalu: ఓటీటీలోకి అందుబాటులోకి రానున్న 8 వసంతాలు.. ఎప్పుడంటే?

8-Vasanthalu-Trailer-Releas
భారత్ సమాచార్.నెట్: ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ నటించిన చిత్రం ‘8 వసంతులు’ ఇటీవల థియేటర్లకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫణింద్ర  నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవనుంది. రిలీజ్ అయిన ముడూ వారాల వ్యవధిలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో అనంతిక సనీల్ కుమార్, రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నేనిఈ చిత్రాన్ని నిర్మించగా.. హెషామ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగా.. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక సినిమా విషయానికొస్తే.. అయోధ్య అనే యువతితో కలిసి వరుణ్, సంజయ్ అనే ఇద్దరు యువకులు జీవితంలోకి ప్రవేశిస్తారు. వారి రాక ఆమె జీవితాన్ని ఎలా మార్చింది? ఆమె భావోద్వేగాలను ఎలా ప్రభావితం చేసింది? అనే కోణంలో కథ సాగుతుంది. థియేటర్‌లో మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో ఎందరి మనసులు గెలుచుకుంటుందో చూడాలి.