భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించి అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులను ప్రతి శాఖకు కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, లేకపోతే ఆ నిధులు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జల జీవన్ మిషన్, ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన, కృషి వికాస్ యోజన, పోషణ్ అభియాన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, మిషన్ వాత్సల్య, త్రిషోన్నతి యోజన, పీఎంఏవై (అర్బన్), ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతిపథకానికి మంజూరైన మొత్తం నిధులు, ఖర్చు వివరాలు, అమలవుతున్న ప్రాంతాలు, మిగిలిన నిధులు, అభివృద్ధి పనులు, పూర్తి గడువు వంటి వివరాలతో మంగళవారం ఉదయం నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
30, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్