భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

అక్రమాలకు పాల్పడితే ఎరువుల డీలర్‌షిప్ రద్దు

WhatsApp Image 2025-12-29 at 8.48.05 PM

భారత్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : రైతులకు ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పత్తికొండ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) మోహన విజయకుమార్ హెచ్చరించారు. సోమవారం పత్తికొండ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను వ్యవసాయాధికారి వెంకటరాముడుతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. ఎరువులను ఎంఆర్‌పీ (MRP) కంటే అధిక ధరలకు అమ్మినా, రశీదులు ఇవ్వకుండా విక్రయించినా లేదా నిల్వలను పక్కదారి పట్టించినా డీలర్‌షిప్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి డీలర్ తప్పనిసరిగా రోజువారీ అమ్మకాలు, స్టాక్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఏ విధమైన మిశ్రమ ఎరువుల విక్రయాలను సహించబోమని ఆయన డీలర్లను హెచ్చరించారు.