భారత్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : రైతులకు ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పత్తికొండ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) మోహన విజయకుమార్ హెచ్చరించారు. సోమవారం పత్తికొండ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను వ్యవసాయాధికారి వెంకటరాముడుతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. ఎరువులను ఎంఆర్‌పీ (MRP) కంటే అధిక ధరలకు అమ్మినా, రశీదులు ఇవ్వకుండా విక్రయించినా లేదా నిల్వలను పక్కదారి పట్టించినా డీలర్‌షిప్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.…