భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: పెద్దకడబూరులో మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ ఏఈ నారాయణ స్వామి నాయకత్వం వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వినియోగదారులతో నేరుగా ముఖాముఖి చర్చలు జరిపి, వారు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, బిల్లుల సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై వినియోగదారులు తమ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏఈ నారాయణ స్వామి మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. వినియోగదారుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తారని స్పష్టం చేశారు. ప్రజలు సమస్యలు ఎదురైతే వెంటనే విద్యుత్ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.
BHARATH SAMACHAR DIGITAL
30, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్