భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్‌లోని రైతు వేదికలో మంగళవారం నాడు యూరియా అమ్మకాలు, పంపిణీపై క్లస్టర్ ఆఫీసర్ అనుపాల రవీందర్, ఎంఏవో సంతోష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బోధన్ పరిధిలోని 11 సహకార సంఘాల సెక్రటరీలు, సేల్స్‌మెన్, ఏఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి యూరియా సేల్ పాయింట్ వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. యూరియా కొనుగోలు చేసే రైతుల నుండి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. స్టాక్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఇండెంట్ పెట్టాలని, సేల్ పాయింట్లలో నిర్ణీత సమయాలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
31, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్