భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్‌లోని రైతు వేదికలో మంగళవారం నాడు యూరియా అమ్మకాలు, పంపిణీపై క్లస్టర్ ఆఫీసర్ అనుపాల రవీందర్, ఎంఏవో సంతోష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బోధన్ పరిధిలోని 11 సహకార సంఘాల సెక్రటరీలు, సేల్స్‌మెన్, ఏఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి యూరియా సేల్ పాయింట్ వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. యూరియా కొనుగోలు చేసే…