భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, జులై 2025, సోమవారంభారత్ సమాచార్

Kerala Cm: కేరళ సీఎం నివాసానికి బాంబు బెదిరింపులు

img_1745823399144_624
భారత్ సమాచార్.నెట్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు పోలీస్‌ స్టేషన్‌కు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించారు. సీఎం అధికారిక నివాసమైన క్లిఫ్‌ హౌస్‌ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే.. బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ల సహాయంతో క్లిఫ్‌ హౌస్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం ఆ బెదిరింపు మెయిల్ నకిలీదని అధికారులు గుర్తంచారు. బాంబు బెదిరింపులు రావడంతో సీఎం అధికారిక నివాసాన్ని మొత్తం పరిశీలించామని.. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఎక్కడా బాంబు జాడ కనిపిచకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ బెదిరింపు సమయంలో సీఎం పినరయి విజయన్ ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇకపోతే గత కొంతకాలంగా దేశంలోని ప్రముఖులకు, ప్రముఖ సంస్థలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, బాంబు బెదిరింపులకు గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపుల వ్యవహారంతో తాజాగా వచ్చి బెదిరింపులకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణతో ఈ అంశంపై ఓ క్లారిటీ రానుంది.