భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మద్దికెరకు చెందిన సగర ముద్దుబిడ్డ, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత విద్యార్థిని ఉప్పర శివానిని మంత్రి టీజీ భరత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శివాని క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, హైదరాబాద్లోని క్రీడా అకాడమీలో ఉత్తమ శిక్షణ పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కర్నూలు జిల్లా ఉప్పర సగర సంఘం అధ్యక్షులు గోనబావి గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూకే వీరేంద్ర, కర్నూలు సిటీ ప్రెసిడెంట్ టీ. రాజేష్, సెక్రటరీ పర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో శివానిని మరోసారి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దొంతి మద్దిలేటి, శివాని తల్లిదండ్రులు గుంతకల్లు నవీన్ తదితరులు పాల్గొని శివానిని అభినందించారు. సగర సమాజం నుంచి ఇలాంటి ప్రతిభావంతులు వెలుగులోకి రావడం గర్వకారణమని, శివాని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.
BHARATH SAMACHAR DIGITAL
5, జనవరి 2026, సోమవారంభారత్ సమాచార్