భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జనవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

నీలకంఠేశ్వరస్వామి మహారథోత్సవంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి

c17049af-1531-4d69-a5c4-eaec73bec658

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు శ్రీశ్రీశ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన మహా రథోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ రథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వరరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్షలాది భక్తులు హాజరైన ఈ మహా రథోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహంతో వైభవంగా సాగింది. రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ ద్వారా పుష్పవర్షం కురిపించడంతో భక్తులు పరవశించి స్వామివారి నామస్మరణతో జాతర ప్రాంగణం మార్మోగింది. రథోత్సవం అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వర రెడ్డి భక్తులు, ప్రజలతో కలిసి స్వామివారి కృపతో అందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ జాతర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ఎమ్మిగనూరు మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించిన ఎమ్మెల్యే, ప్రజలతో మమేకమై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మంత్రాలయం ఇన్‌చార్జ్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.