భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు శ్రీశ్రీశ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన మహా రథోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ రథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వరరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్షలాది భక్తులు హాజరైన ఈ మహా రథోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహంతో వైభవంగా సాగింది. రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ ద్వారా పుష్పవర్షం కురిపించడంతో భక్తులు పరవశించి స్వామివారి నామస్మరణతో జాతర ప్రాంగణం మార్మోగింది. రథోత్సవం అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వర రెడ్డి భక్తులు,…