భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న “ఇందిరమ్మ ఇళ్ల” నిర్మాణ పనులను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. నర్సాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చాకలి భూమయ్య విద్యుత్ షాక్ కు గురై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూమయ్యను వారు పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం, పీఏసీఎస్ ఛైర్మన్ రాజు యాదవ్, ప్రముఖ సంఘ సేవా అవార్డు గ్రహీత గంగాధర్, రెడ్డిపల్లి సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్, గొల్లపల్లి సర్పంచ్ క్రిష్ణ గౌడ్, శ్రీశైలం యాదవ్, మల్లేష్ యాదవ్, రామాగౌడ్, శ్రీనివాస్, దాడిగా నరేష్, రాజు, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.
BHARATH SAMACHAR DIGITAL
7, జనవరి 2026, బుధవారంభారత్ సమాచార్