భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న “ఇందిరమ్మ ఇళ్ల” నిర్మాణ పనులను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. నర్సాపూర్…