భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి: రఘునందన్ రావు

03a4c91f-58e5-46c1-b88f-a9d5cc028b2c

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో బిజెపి కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హయాంలో డబుల్ బెడ్రూంలో వచ్చాయని, బీదవారికి ఇస్తామని కాగితాలు బీరువాలో పెట్టి ఉంచారన్నారు. ఆ కాగితాలు ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదని అన్నారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతుంది చాలా కష్టపడుతుంది పేపర్లో వచ్చే విధంగా ఎన్నో విషయాలు తీసుకువస్తుందన్నారు. నేనే ఒక మీడియా సమావేశంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పానన్నారు. కవిత కొత్త పార్టీ పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. మరి ఎవరికి మద్దతు అనేది నేనే త్వరలో చెప్తానని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దుబ్బాక ఎలక్షన్లపైన నా పైన ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నాపై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు బిజెపి ప్రభుత్వం చేసిన హామీలను సంక్షేమలను గుర్తించి నన్ను ఎంపీగా ఎన్నుకున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు బలోపేతంగా కృషిచేసి బిజెపి జెండా ఎగిరేలా చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్, జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ బుచ్చేషు యాదవ్, రాజేందర్, యాదగిరి, సంఘసాని సురేశ్, పట్టణ అధ్యక్షులు చంద్రయ్య, జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు గౌడ్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.