భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

బీవీఆర్ఐటీలో 3డీ ప్రింటింగ్‌పై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

210019e1-3ef2-4a33-99b9-5e6cb96613ed

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో గల బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో 3డి ప్రింటింగ్‌పై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్” ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ (బీఎంఈ) విభాగాల ఆధ్వర్యంలో “3డి ప్రింటింగ్ అండ్ సంకలిత తయారీ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఆరోగ్య సంరక్షణ అనే అంశంపై జనవరి నెల 5వ తేదీ నుంచి 10 జనవరి 2026 వరకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అండ్ షార్ట్‌టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఐదు రోజుల కార్యక్రమంలో 90 మంది అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్, ఆదియమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఆటోనమస్), గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ – ఈస్ట్ మారెడ్‌పల్లి, శ్రీ ఇందు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ సరస్వతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (టొండవల్లి), వీఐపీఈఆర్ నుంచి పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐపీఈఆర్ హైదరాబాద్, ఎన్ఐపీఈఆర్ కోల్‌కతా, ఉస్మానియా యూనివర్సిటీ, ఎన్ఈహెచ్‌యూ యూనివర్సిటీ నుంచి వచ్చిన నిపుణులు పాఠ్యఅంశాలు బోధించారు. 3డి ప్రింటింగ్ సాంకేతికతలు ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఎలా ఉపయోగించాలో తెలియపరిచారు. నూతన టెక్నాలజీ ఆవశ్యకతను ఆరోగ్య మరియు బయోమెడికల్ ఇంజనీరింగ్ లలో ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై శిక్షణ తరగతులను అధ్యాపకులకు నేర్పించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి విలువైన మార్గనిర్దేశం, నిరంతర సహకారం అందించిన శ్రీ విష్ణు విద్యా సంస్థల ఛైర్మన్ కేవీ.విష్ణురాజుకి అతిథులుగా వచ్చిన వక్తలు, పాల్గొన్న ఫాకల్టీ మెంబర్స్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం చివరి రోజు అయినా శనివారం ఈ ఫాకల్టీ డెవలప్మెంట్ ముగింపు కార్యక్రమంలో డైరెక్టర్ డా.లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ డా.సంజయ్ దూబే, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డా.పీ.విష్ణు, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డా.హెచ్.సుజనా, వివిధ శాఖల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కాలేజీ డీన్, సబ్జెక్టు నిపుణులు, శిక్షణకు వచ్చిన అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.