భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, జనవరి 2026, సోమవారంభారత్ సమాచార్

ఆదోనిలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

c5b1e264-8ed9-4f5b-90da-974955a52246

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదోని పట్టణంలోని శక్తి గుడి అంబ భవాని దేవాలయం ఆవరణలో అంకిని దశాంకిని మహిళ కో-ఆపరేటివ్ సొసైటీ, వరల్డ్ సకలసాలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముగ్గులు మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, మహిళల్లో సృజనాత్మకతను వెలికి తీసే అద్భుత కళారూపమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ముగ్గు వేసే సంప్రదాయం శుభశకునంగా భావించబడుతుందన్నారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాక సమాజంలో ఐక్యత, ఆనందాన్ని పెంచుతాయని తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలను ఆమె అభినందించి, విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు.