భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇంఛార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ఉమాదేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. వెల్దుర్తి మండలంలో ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని భూమి ఉన్న రైతులకు ఎటువంటి భూసమస్యలు ఉన్నా నేరుగా ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను తెలియజేస్తే పరిష్కారం చేసే విధంగానే తాము వెల్దుర్తి మండల రైతుల సదా సేవలోని ఉంటామని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మండల ప్రజలు, అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
13, జనవరి 2026, మంగళవారంభారత్ సమాచార్