భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇంఛార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ఉమాదేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. వెల్దుర్తి మండలంలో ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని భూమి ఉన్న రైతులకు ఎటువంటి భూసమస్యలు ఉన్నా నేరుగా ప్రతి సోమవారం తహసీల్దార్…