భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, జనవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

రేపు డీడీఓలకు ‘IFMIS ఈ-వోచర్స్’ శిక్షణ కార్యక్రమం

WhatsApp Image 2026-01-12 at 6.10.24 PM (1)

భార‌త్ సమాచార్ నెట్, మెదక్ : జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో ఐఎఫ్ఎంఐఎస్ (IFMIS) ఈ-వోచర్స్ (ఆధార్ ఈ-సిగ్నేచర్) పై జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. సోమవారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారులకు ఈ నూతన విధానంపై అవగాహన కల్పించారు.

దీని కొనసాగింపుగా, జిల్లాలోని డివిజనల్, మండల స్థాయి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల (DDOs) అందరికీ ఈ నెల 13న (మంగళవారం) ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్ ఆధారిత ఈ-సిగ్నేచర్ విధానంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి జిల్లాలోని సమస్త డీడీఓలు తప్పనిసరిగా హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.