భారత్ సమాచార్, హైదరాబాద్: పురాణపండ శ్రీనివాస్ అనగానే అక్షర దీపాల ప్రభలు కట్టిన ప్రతిభాస్వంతుడైన ధన్య చరితుడు గుర్తొస్తారనేది రెండున్నర దశాబ్దాలుగా శ్రీనివాస్ అమోఘ కృషితో అందించిన గ్రంథాలకు వేల వేల పూజా పీఠాలే సాక్షం. శ్రీశైల మహాక్షేత్రానికి ప్రత్యేక సలహాదారుడిగా భక్తి పారవశ్యపు సేవలందించిన పురాణపండ శ్రీనివాస్ అపూర్వ రచనలు, సంకలనాలు ఈ దేశపు ఎల్లలుదాటి అనేక దేశాల్లో తెలుగువారిని భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతున్నాయని మేధో సమాజం అనేక సందర్భాల్లో కోడై కోసిన విషయం తెలిసిందే.
నిస్వార్థ సేవకుడు.. పుస్తక మాంత్రికుడు.. పురాణపండ శ్రీనివాస్:
మహా సరస్వతీదేవి శ్రీ చరణాల చెంత మంత్రముగ్ధమైన అమృత రసధారల్లాంటి పవిత్ర గ్రంథాల వెలుగులు నిరంతరాయంగా పొంగిస్తున్న పుస్తక మాంత్రికుడిగా విశేషఖ్యాతి పొందిన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారిక మాసపత్రిక ఆరాధన మాసపత్రిక పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ఆర్ష భారతీయ వైభవ గ్రంథాలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదనేది జగమెరిగిన సత్యం. అపురూప కవిత్వ పుష్ఠితో , అద్భుతమైన ఆర్ష సంస్కృతానురక్తితో, మాటల్లో మార్దవంతో , కంఠంలో వైదిక వైదుష్యంతో ఎన్నో ఎన్నెన్నో సభల్లో , ఇంకా ఎన్నెన్నో అమోఘ గ్రంథాలతో బ్రహ్మానందం వైపు, జ్ఞానానందం వైపు అప్రతిహతంగా నిస్వార్ధంతో సాగుతున్న పురాణపండ శ్రీనివాస్ వచ్చే శివరాత్రికి సుమారు ఐదువందలపేజీల ‘శంభో మహాదేవ’ అఖండ గ్రంథాన్ని విడుదల చేయనున్నారు.
సంచలనం సృష్టించిన గ్రంథాలెన్నో:
ఒక చోట పుస్తకం , మరొక చోట అద్భుత ప్రసంగం … ఇలా సాగుతున్న శ్రీనివాస్ ప్రయాణంలో శ్రీ పూర్ణిమ , శ్రీమాలిక, నేనున్నాను, అమ్మణ్ణి అఖండ గ్రంథాలు సృష్టించిన సంచలనం సాహితీవేత్తలకు, ఆధ్యాత్మిక వేత్తలకు, భక్త పాఠకులకూ తెలిసిన విషయమే. అయితే త్వరలో ఆవిష్కరించనున్న ‘శంభో మహాదేవ’ అఖండ గ్రంథాన్ని కాలభైరవ ప్రచురణల సంస్థ వారికి రైట్స్ ఇచ్చినట్లు సమాచారం.
‘శంభో మహాదేవ’ గ్రంథాన్ని ఆదరిద్దాం, ఆవిశ్యకతను చాటిచెపుదాం:
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల ప్రముఖుల్లో ఎక్కువమంది ఆసక్తి చూపేది పురాణపండ శ్రీనివాస్ గ్రంథాలవైపేనని గతంలో ప్రముఖ సినీ నటుడు మాగంటి మురళీమోహన్ రవీంద్రభారతిలో జరిగిన ఒక సభలో స్పష్టం చేసిన విషయం విజ్ఞులందరికీ తెలిసిందే. మురళీ మోహన్ పేర్కొన్న ఈ బలమైన వాఖ్యానికి నాటి సభలో ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కేవీ.రమణాచారే ప్రత్యక్ష సాక్షి. పురాణపండ శ్రీనివాస్ నుంచి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వెలువడుతున్న మరో అపరూప శంభో మహాదేవ అఖండ గ్రంథాన్ని ఆదరిద్దాం, మన గ్రంథాల ఆవిశ్యకతను చాటిచెపుదాం.
మరిన్ని కథనాలు:
ఉచితంగా.. పురాణపండ విష్ణు సహస్రనామ గ్రంథం