భారత్ సమాచార్, హైదరాబాద్: పురాణపండ శ్రీనివాస్ అనగానే అక్షర దీపాల ప్రభలు కట్టిన ప్రతిభాస్వంతుడైన ధన్య చరితుడు గుర్తొస్తారనేది రెండున్నర దశాబ్దాలుగా శ్రీనివాస్ అమోఘ కృషితో అందించిన గ్రంథాలకు వేల వేల పూజా పీఠాలే సాక్షం. శ్రీశైల మహాక్షేత్రానికి ప్రత్యేక సలహాదారుడిగా భక్తి పారవశ్యపు సేవలందించిన పురాణపండ శ్రీనివాస్ అపూర్వ రచనలు, సంకలనాలు ఈ దేశపు ఎల్లలుదాటి అనేక దేశాల్లో తెలుగువారిని భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతున్నాయని మేధో సమాజం అనేక సందర్భాల్లో కోడై కోసిన విషయం తెలిసిందే.
నిస్వార్థ సేవకుడు.. పుస్తక మాంత్రికుడు.. పురాణపండ…





