భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, జనవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

వెంకీ మూవీలో నారా రోహిత్

IMG-20260120-WA0001

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. చాలా కాలం తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు నారా రోహిత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కేవలం సాధారణ పాత్ర మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటించబోతున్నారని తెలుస్తోంది. నారా రోహిత్ గతంలో హీరోగానే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు.

త్రివిక్రమ్ డిజైన్ చేసిన ఈ పవర్‌ఫుల్ పాత్ర ఆయన ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుందని, అందుకే రోహిత్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాలో వెంకీ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ డ్రామాకు, త్రివిక్రమ్ పదునైన సంభాషణలు తోడవ్వడం, దానికి తోడు నారా రోహిత్ వంటి టాలెంటెడ్ నటుడు తోడవడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. త్వరలోనే నారా రోహిత్ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం.

మరిన్ని కథనాలు:

స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ..