భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

వార్డ్ సభ్యురాలు సరితకు సన్మానం

d353f5a6-e065-422b-9289-a577c4d50191

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు మునిగంటి సరితను తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర సంఘం హైదరాబాదులో ఆదివారం ఘనంగా సన్మానించింది. రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధుల సన్మానంలో భాగంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేములవాడ మదనమోహన్, చొల్లేటి కృష్ణమాచారిలతో కలిసి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చేతుల మీదుగా సరితకు శాలువా కప్పి మెమొంటో అందజేసి గౌరవించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ.. రాష్ట్ర సంఘం సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సరిత భర్త, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నేత మునిగంటి రాజు చారి తదితరులు ఉన్నారు.