భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు మునిగంటి సరితను తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర సంఘం హైదరాబాదులో ఆదివారం ఘనంగా సన్మానించింది. రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధుల సన్మానంలో భాగంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేములవాడ మదనమోహన్, చొల్లేటి కృష్ణమాచారిలతో కలిసి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చేతుల మీదుగా సరితకు శాలువా కప్పి మెమొంటో అందజేసి గౌరవించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ.. రాష్ట్ర సంఘం సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.…