భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: ఫిబ్రవరి రెండో శనివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు హైదరాబాద్ రవీంద్ర భారతి మొదటి అంతస్తు మినీ కాన్ఫరెన్స్ హాలులో కథా ప్రపంచం-2025 ఆవిష్కరణ మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు మలిశెట్టి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వశ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు రిటైర్డ్ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ విహారి శరత్ చంద్ర పాల్గొంటారు. తెలుగు, పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని నలు మూలలతో పాటు విదేశాల నుంచి కూడా ఎమ్మెస్సార్ జాతీయస్థాయి కథల పోటీకి కథలు వచ్చాయి. వి.శాంతి ప్రబోధ రాసిన ‘న్యూరో చిప్డ్ మనిషి’ కథకు ఐదువేల రూపాయల మొదటి బహుమతి లభించింది. డాక్టర్ కిరణ్ రాసిన ‘నీది నీది కాదు’ కథకు మూడువేల రూపాయల ద్వితీయ బహుమతి లభించింది.పొత్తూరి సీతారామరాజు రాసిన ‘ధన్వంతరి’ కథకు రెండు వేలరూపాయల తృతీయ బహుమతి లభించింది.
ఐదు కథలకు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం జరిగింది.డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు (విధివంచిత) గౌతమ్ లింగా దక్షిణాఫ్రికా (త్వం జీవ శరదాం శతం)వేణు మరీదు (చిటారుకొమ్మన చీకటిపొట్లం) వెంకటమణి( నల్ల కుక్క), మజ్జి భారతి(కాడెద్దులు) ఇవి కాక మరో ఆరు కథలను సాధారణ ప్రచురణకు స్వీకరించడం జరిగింది. సశేషం-శ్రీదేవి బంటుపల్లి, అమ్మ కోరిక-అరసాడ శేషగిరి, మమత మారాకు తొడిగింది- కె.వి.సుమలత, వృద్ధాశ్రమాలు-పి. వి. రామశర్మ ఆకాశగంగ- పాండ్రంకి సుబ్రమణి, రూమ్మేట్స్-ఎమ్. విజయశ్రీముఖి. పోటీలో గెలుపొందిన కథలతో కథా ప్రపంచం 2025 కథా సంకలనం ఆవిష్కరించబడుతుందని తెలిపారు. మలిశెట్టి సీతారాం స్మారక సాహిత్య పురస్కారాలు 2025 మలిశెట్టి సీతారం స్మారక జీవన సాఫల్య సాహితీ పురస్కారం-2025 ను రూ 11,116 నగదు సహా సుప్రసిద్ధ కథా నవలారచయిత, విమర్శకులు వి.రాజా రామ్ మోహనరావుకి మలిశెట్టి సీతారాం వార్షిక సాహితీ పురస్కారం 2025ను రూ. 10,000 నగదు, సహా కథారచయిత్రి ఊహకు ఫిబ్రవరి 14వ తేదీ రెండవ శనివారం ఉదయం 10:30 గంటలకు హైద్రాబాద్ రవీంద్ర భారతి మొదటి అంతస్తు మినీ సమావేశం మందిరంలో జరిగే సాహితీ కార్యక్రమంలో అందచేయటం జరుగుతుందని రచయితలు కవులు సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని తెలిపారు.