భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రకారం 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని, జీరాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జరగనుంది. సమావేశంలో సివిల్ సప్లై, మున్సిపల్ హమాలీ కార్మికులు, సిఐటీయు నాయకులు పాల్గొన్నారు. కేంద్రం పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడం, పేదలకు సంక్షేమ పథకాలను విస్మరించడం, నాలుగు లేబర్ కోడ్ ల ద్వారా కార్మికులను నయా బానిసలుగా మార్చే విధానం జరుగుతున్నట్టు, పని గంటలు పెంచి వేతనాలను యాజమాన్లకు నచ్చే రీతిలో అమలు చేయడం, కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయకపోవడం వంటి అంశాలను విమర్శించారు. కార్మికులు రెగ్యులర్ అయ్యేలా, కనీస వేతనాలు అమలు చేయబడేలా, పిఎఫ్ కేసులు పరిష్కరించేలా, కూలి రేట్లు వార్షికంగా సర్దుబాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
30, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్