భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

ఉపాధి పథకం పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

296cb9fe-22eb-40a5-86c4-e8f3d839d6cd

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోనిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి “ఏ.బి.జి. రాంజీ”గా ప్రతిపాదించడం గాంధీజీ ఆశయాలకు, దేశ ప్రజల భావోద్వేగాలకు విరుద్ధమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, పట్టణ కార్యదర్శి టి. వీరేష్ తీవ్రంగా ఖండించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ నాయకత్వంలో, మండల కార్యదర్శి కల్లుబాయి రాజు అధ్యక్షతన ఆదోనిలో సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ పేదల జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం పేరు మార్చే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కోట్లాది గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు యు. లక్ష్మీనారాయణ, కే. రమేష్ కుమార్, రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్, సీపీఐ మండల సహాయ కార్యదర్శులు కొత్తూరు గంగన్న, సత్యనారాయణ, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రీకాంత్, పుష్పరాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.